ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం ఈడీ అధికారుుల కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఆమె చిరునవ్వుతో ఈడీ ఆఫీస్ నుంచి బయటికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా మరో సారి ఈ నెల16న కవిత ఈడీ విచారణకు హాజరవుతుంది.