హైదరాబాద్‌లో చదువుకునేందుకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులు దారితప్పుతున్నారు. పెద్దఅంబర్‌పేట పరిధిలోని ఓ ఫాంహౌజ్‌లో జరుగుతున్న రేవ్ పార్టీలో 4 యువతులతో పాటు 37 మందిపై పోలీసులు కెేసు నమోదు చేశారు. ఓ విద్యార్థి బర్త్‌డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసుకుని గంజాయి, మద్యం, డీజే మోతతో హోరెత్తించినట్లు పోలీసులు తెలిపారు. ఫాం హౌజ్ నిర్వాహకుడు సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వేడుకల పేరుతో ఇలాంటివి చేస్తే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు విద్యార్థులను హెచ్చరిస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల రేవ్ పార్టీ

© Envato(representational)