ఇంటర్మీడియట్లో కొన్ని సబ్జెక్టులు చదవకపోయినా ఇంజినీరింగ్‌లో ప్రవేశం కల్పించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆలోచిస్తోంది. ఇందుకోసం నిపుణులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సీఎస్ఈ, ఈఈఈ, సీఈఈ తదితర బ్రాంచీల్లో ప్రవేశాలకు కెమిస్ట్రీ, అగ్రికల్చర్, బయో టెక్నాలజీ ఇంజినీరింగ్‌కు మ్యాథ్స్, బి.ప్లానింగ్‌కు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి కాదని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.