6వ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

Courtesy Instagram:BCCI

ఇండియా, ఇంగ్లండ్ 5వ టెస్టులో టీమిండియా పై చేయి సాధించేలా కనిపిస్తోంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (25) కూడా పెవిలియన్ చేరాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 416 పరుగులు చేసింది. ఇండియన్ ఇన్నింగ్స్ లో జడేజా, పంత్ సెంచరీలతో కదం తొక్కారు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 100లోపే 5 వికెట్లను కోల్పోయినా కానీ కెప్టెన్ స్టోక్స్, విధ్వంసకర బ్యాటర్ జాస్ బట్లర్ (72*) ఆదుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది.

Exit mobile version