అందంగా కనిపించాలని చాలామంది రకరకాల పాట్లు పడుతుంటారు. క్రీములు, ప్యాక్ లు, మసాజ్ లు కొంతమందైతే సర్జరీలు కూడా చేసుకుంటారు. కానీ ఇంగ్లండ్ చెందిన ఓ వ్యక్తి మాత్రం ఒళ్లు జలదరించే పనిచేస్తున్నాడు. యవ్వనంగా కనిపించేందుకు తన మూత్రం తానే తాగుతున్నాడు. 2016 నుంచి రోజూ 200మి.లీ.ల మూత్రం తాగుతున్నాడు. ఈ విషయం ఓ ఆంగ్లపత్రికలో వచ్చింది. మూత్రం తాగడాన్ని సైన్సు పరిభాషలో యూరిన్ థెరపీ అంటారు. ఈ యూరిన్ థెరపీతో తనకు మానసిక ప్రశాంతత కలుగుతుందని, తన వయసు కూడా తక్కువగా కనిపిస్తుందని ఈ 31ఏళ్ల యువకుడు చెబుతున్నాడు. తన చర్యలు ఇంట్లో వారికి చిరాకు తెప్పించినా తను మాత్రం కొనసాగిస్తున్నాడు.