ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తన జోరు చూపిస్తోంది. ప్రి క్వార్టర్స్‌లో 3-0 తేడాతో సెనెగల్‌ను చిత్తు చేసి ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 38వ నిమిషంలో జోర్డాన్ హెండర్సన్ గోల్ కొట్టి ఇంగ్లండ్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఈ జోరుతో 48వ నిమిషంలో హ్యారీ కేన్ గోల్ కొట్టి 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆట ముగుస్తుందనగా అనూహ్యంగా 87వ నిమిషంలో బుకాయా సాకి గోల్ కొట్టి ఇంగ్లండ్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. సెనెగల్ పలుమార్లు గోల్ కొట్టేందుకు యత్నించినా ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.