పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు పాక్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. పాక్ పర్యటనలో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ మొదటి సెషన్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 27 ఓవర్లలో ఏకంగా 174 పరుగులు చేసింది. జాక్ క్రావ్లే 38 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. 13.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును చేరుకుంది. వీరి ఆటను చూసి ‘మీరు ఆడుతుంది టెస్టా, టీ20నా’ అంటూ నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.