అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పసికూన బంగ్లాదేశ్..డిఫెండింగ్ టీ20 చాంపియన్స్ ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది. సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. ఢాకాలో ఇవాళ జరిగిన మూడో టీ20లో 16 పరుగులతో విజయం సాధించింది. లిటన్ దాస్(73) బ్యాటుతో చెలరేగగా… బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఓ దశలో మలన్, బట్లర్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా.. ఆ తర్వాత 28 పరుగులకు బంగ్లా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌కు ఓటమిని మూటగట్టింది.