తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నట్లు నిర్ణయించారు. ముందుగా 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. దశల వారీగా అన్ని తరగతులకు ఇంప్లీమెంట్ చేస్తామన్నారు. అయితే 2 నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించినట్లు చెప్పారు. ఆ నిర్ణయాలు త్వరలోనే తెలియజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.