EPFOలో సమస్యలతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సుమారు వారం రోజులుగా ఈ-పాస్ బుక్ ఓపెన్ కావడం లేదు. ఎప్పుడూ చూసిన సాయంత్రం 5 గంటల తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయని చూపిస్తుంది. కొద్దిరోజులుగా ఇదే మెసేజ్ కనిపిస్తుండటంపై చందాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉమాంగ్ యాప్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. టెక్నికల్ మెయింటెన్స్ వల్ల ఇలా జరుగుతుందని తెలుస్తోంది. కానీ, ఇంకెన్ని రోజులు చేస్తారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.