తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటలను అధ్యక్షుడిగా నియమించడంపై బీజేపీ అధిష్ఠానం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంపై కూడా దృష్టిసారించినట్లు సమాచారం. తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉండటం, కేసీఆర్ వ్యూహాలను పసిగట్టగలిగే నేర్పు ఉండటంతో రాజేందర్‌కి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని హైకమాండ్ చూస్తోందట. ఇదే జరిగితే మరి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, ఈటల మధ్య నాయకత్వ పోరు ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.