భారత రాష్ట్ర సమతి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమయ్యింది. ఖమ్మం వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే దిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్‌తో పాటు అఖిలేష్, రాజా వంటి ప్రముఖులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వెంకటాయపాలెం సమీపంలో సుమారు 70 ఎకరాల్లో సభ నిర్వహిస్తుండగా.. సుమారు 5 లక్షలకుపైగా వస్తారని అంచనా. పార్టీ జాతీయ జెండాతో పాటు భాజపాకు ప్రత్యామ్నాయ ఎజెండాను కేసీఆర్ ప్రకటిస్తారు.