నటుడు విశాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ ఫొటోను తన ఛాతిపై పచ్చబొట్టు వేయించుకోవడమే ఇందుకు కారణం. తమిళ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఎంజీఆర్‌కి విశాల్ గొప్ప అభిమాని. బహుశా అందుకేనేమో అని కొందరు అంటుండగా, రాజకీయంగా అన్నాడీఎంకే పార్టీకి దగ్గర కావాలని అనుకుంటున్నాడని మరికొందరు వాదిస్తున్నారు. సినిమాలో పాత్ర కోసమని ఇంకొందరి అభిప్రాయం. తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే రూమర్లని విశాల్ గతంలోనే ఖండించాడు. ప్రస్తుతం ఈ హీరో మార్కో ఆంటోనీ సినిమా చేస్తున్నాడు.
-
Courtesy Twitter:@onlynikil -