న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీసులు పంపింది. గతంలో ఇదే కేసులో సీబీఐ ముందు హాజరైన ఆమంచిని మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు విజయవాడలో సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఏ)కింద నోటీసులు జారీచేసినట్లు తెలిపింది. న్యాయవవస్థను కించపరుస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో గత నవంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.