వివాహమైన కొంత కాలానికే కుమారుడు చనిపోగా… కోడలికి మరో పెళ్లి చేసి ఆదర్శాన్ని చాటాడు ఓ మాజీ MLA. ఒడిశాలో జరిగిన ఈ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢెంకనాల్ జిల్లా గందియ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నవీన్ నంద ఈ తంతు జరిపించాడు. నవీన్ నంద కుమారుడు సంబిత్కు మధుస్మిత అనే యువతితో వివాహం జరిగింది. కరోనా కోరలకు చిక్కి పెళ్లయిన కొంతకాలానికే సంబిత్ చనిపోయాడు. భర్తను కోల్పోయిన మధుస్మిత అత్తవారింట్లోనే ఉంటోంది. అయితే కోడలి ఒంటరితనాన్ని చూసి భరించలేకపోయిన నవీన్ నంద ఆమెను పెళ్లికి ఒప్పించి వివాహం జరిపించాడు.