పశ్చిమగోదావరి జిల్లాలో హెటెన్షన్ నెలకొంది. కాపు రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దీక్ష భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. దీక్షకు ముందే ఆయన ఇంటివద్ద భారీగా మెహరించారు. అప్పటికే సిద్ధం చేసిన అంబులెన్స్‌లో ఏలూరుకి తరలించారు. జోగయ్య ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు నిరాకరించారు. చెప్పినవిధంగానే దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాపు రిజర్వేషన్ల కోసం చావడానికైనా సిద్ధమంటూ వ్యాఖ్యానించారు.