హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, టెలికాం మాజీ మంత్రి సుఖ్ రామ్(94) బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురై లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో చికిత్స పొందుతూ నేడు మరణించారు.