ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని ప్రతి ఒక్కరు కష్టపడుతూ చదువుతుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగం సంపాదించిన తరువాత సుఖంగా జీవించొచ్చని అనుకుంటారు. అదే జాబ్ రాకపోతే పడే బాధ మాటల్లో కూడా చెప్పుకోలేం. అలాంటి ఘటనే ఇది. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం, పెద్దసీది గ్రామానికి చెందిన కేదరీశ్వరరావు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశారు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడే ఈయన 1998 DSC జాబితాలో ఉద్యోగం సంపాదించాడు. అయితే కొన్ని వివాదాల కారణంగా ఈ నోటిఫికేషన్ అప్పట్లో ఆగిపోయింది. దీంతో అతను మతిస్థిమితం కోల్పోయాడు. అయితే తాజగా ప్రభుత్వం ఆ బ్యాచ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో 24 ఏళ్ల తరువాత కేదరీశ్వరరావుకు ఉద్యోగం వచ్చింది. ఆయనకు ప్రస్తుతం 55 ఏళ్ళు కాగా.. మరో 10 సంవత్సరాలు కూడా పని చేయకుండా రిటైర్ అవుతాడు.