డిగ్రీ పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఐఎస్బీ, యూనివర్సిటీల వీసీలతో హయ్యర్ ఎడ్యుకేషన్ సమావేశమైంది. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు. ఎగ్జామినేషన్, ఎవాల్యూయేషన్, అసెస్మెంట్లలో భారీ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు వచ్చే విధంగా పరీక్షలు ఉండాలని భావించారు. దీనికి సంబంధించిన బాధ్యతలు ఐఎస్బీకి కట్టబెట్టింది.