‘నాటు నాటుకు’ ఆస్కార్ రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. RRR టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆవార్డు ప్రకటించే సమయంలో ఉత్కంఠకు లోనైట్లు చెప్పారు. చరణ్ ఇందులో భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి, తారక్, కిరవాణి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఒక తండ్రిగా చరణ్‌ను చూసి గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.