కు.ని. మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ ప్రకటించారు. ‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు దేశవ్యాప్తంగా జరిగేవే, ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలోన నిర్వహించాం. అనుభవజ్ఞులైన సర్జన్‌తోనే 34 మందికి ఆపరేషన్‌ చేశాం. అందులో నలుగురు చనిపోయారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, డబుల్‌బెడ్‌రూం ఇల్లు, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది’ అని డీహెచ్‌ పేర్కొన్నారు.

Exit mobile version