యంగ్ క్రికెటర్ రాహుల్ తెవాటియాకు మరోమారు సెలెక్టర్లు మొండి చేయి చూపారు. ఐర్లాండ్ తో టీమిండియా ఆడనున్న రెండు టీ20లకు ఈ యంగ్ ప్లేయర్ ను ఎంపిక చేయలేదు. దీంతో ఇతడు ఫుల్ హర్ట్ అయ్యాడు. ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుందని సోషల్ మీడియాలో ఎమోజీలను షేర్ చేశాడు. తెవాటియా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. తెవాటియా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు. గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు ఈ యంగ్ ప్లేయర్ సెలెక్ట్ అయినా కానీ ఫిట్నెస్ పరీక్షల్లో విఫలమయ్యాడు.