భారత్ నుంచి బ్రిటన్ వీసాల దరఖాస్తు ప్రక్రియలో జరిగిన జాప్యానికి యుకే స్పందించింది. వెంటనే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ‘వివిధ కారణాల వల్ల భారత్ నుంచి వీసాల దరఖాస్తులు పెరిగాయి. నిపుణుల వీసాలకు త్వరగా అనుమతులు జారీ చేస్తున్నాం. ఇక విజిటర్ వీసాలను 15రోజుల్లోగా జారీ చేయడంపై దృష్టిపెట్టాం. దిల్లీ, యుకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా బృందాలు దీనిపై సమిష్టిగా కృషి చేస్తున్నాయి. మేం తిరిగి గాడిన పడ్డాం’ అని బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ హెల్లీస్ ట్విటర్లో వెల్లడించారు.