మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఎలన్ మస్క్‌కి చెందిన న్యూరాలింక్ చిప్‌ని తయారు చేసింది. ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’(బీసీఏ) సాంకేతికతను మానవులపై ప్రయోగించేందుకు న్యూరాలింక్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం ఎఫ్డీఏకు పంపడానికి ప్రతులను రెడీ చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ఇదే కాకుండా మరో రెండు చిప్‌లనూ తయారు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పక్షవాతం బారిన పడ్డా, అవయవాల్లో కదలిక తీసుకొచ్చే చిప్ ఒకటి, కంటిచూపు కోల్పోయినా చూడగలిగేలా మరొక చిప్‌ని తీసుకువచ్చే యోచనలో న్యూరాలింగ్ ఉంది.