హైదరాబాద్ హకీంపేట్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్టవ్ రిపేర్ దుకాణంలో పేలుడు సంభవించింది. పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లు నింపే క్రమంలో పేలాయి. భారీ శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాంబుల మాదిరిగా పేలడంతో వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.