ఎలక్ట్రిక్ బైక్ల పేలుడు ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడులో ఇంటిముందు చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారిగా పేలింది. అర్ధరాత్రి పెద్ద శబ్దం రావడంతో కుటుంబమంతా ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంటికి మంటలు అంటుకోవడంతో నీటితో చల్లార్చారు. పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయని ఇటీవలే ఎలక్ట్రిక్ బైక్ కొన్నానని బాధితుడు లక్ష్మీనారాయణ చెప్పారు.