తాలిబన్ దళం చేతుల్లోకి అధికారం వచ్చినా అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల దాడులు ఆగడం లేదు. పదే పదే విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ మతపరమైన పాఠశాలపై ముష్కరులు బాంబుదాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 10మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఉత్తర సమంగాన్ ప్రావిన్సులో అయ్బాక్లో ఈ ఘటన జరిగిందని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కాగా, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ప్రకటించలేదు.
అఫ్గాన్‌లో పేలుడు.. 10మంది మృతి

© File Photo