మసీదులో పేలుడు..20 మంది మృతి, మరో 40 మందికి గాయాలు

screen shot

ఆప్గానిస్తాన్ రాజధాని కాబూల్‌కు సమీపంలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 20 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నట్లు సమయంలో పేలుడు జరిగిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ బ్లాస్ట్ గురించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. మరోవైపు ఆప్గానిస్తాన్ పై తమకు పూర్తి నియంత్రణ ఉందని తాలిబన్లు చెబుతున్నారు.

Exit mobile version