పాకిస్తాన్ టీ20 జట్టులో చోటు దక్కించుకోవాలంటే కనీసం 135 స్ట్రైక్ రేట్ ఉండాలని పీసీబీ చీఫ్ సెలెక్టర్ షాహిద్ అఫ్రిదీ స్పష్టంచేశాడు. యావరేజ్ కూడా 45పైగానే ఉండాలని తెలిపాడు. దీంతో పాకిస్తాన్ టీ20 ఆటగాళ్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు జట్టులో చోటు కోల్పోవాల్సి ఉంటుంది. బాబర్ స్ట్రైక్‌రేట్ 127గా ఉండగా, రిజ్వాన్‌ది 126గా ఉంది. దీనిప్రకారం వీరిద్దరికీ జట్టులో చోటు కష్టమే. కానీ పాకిస్తాన్ తరఫున టీ20 ఆడుతున్న 16 మంది ప్లేయర్లకు గానూ ఇద్దరికి (షాదాబ్, నవాజ్) మాత్రమే 135 స్ట్రైక్‌రేట్ ఉంది.