TS: ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే, ఈ హత్యను ఖండిస్తూ ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారి హత్యకు పాల్పడిన గొత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామసభ తీర్మానించింది. ఎర్రబోడు నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు తరలించాలని తీర్మానంలో పేర్కొంది. మరోవైపు, ఫారెస్ట్ అధికారులు విధుల్లో పాల్గొనాలని పీసీసీఎఫ్ డోబ్రియాల్ కోరారు. అటవీ అధికారుల రక్షణకు తగిన ప్రతిపాదనలు పంపించామని సమీక్షా సమావేశంలో ఆయన వెల్లడించారు.