యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఎక్స్ టర్ పరిశోధనలో పురుషుల గురించి పలు ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. సాధారణంగా మహిళల్లో రెండు X క్రోమోజోములు ఉంటాయి. పురుషుల్లో ఒక X ఒక Y క్రమోజోమ్ ఉంటాయి. కానీ ప్రతి 500 మంది మగవాళ్లలో ఒకరికి ఎక్స్ ట్రా క్రోమోజోమ్ ఉంటుందని శాస్త్రవేేత్తలు గుర్తించారు. X క్రోమోజోమ్ ఎక్స్ ట్రా ఉంటే సంతాన సమస్యలు రావొచ్చని పేర్కొన్నారు. అలాగే ఎక్స్ ట్రా క్రోమోజోమ్ ఉన్నవారిలో టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుందని వారి అధ్యయనంలో గుర్తించారు. 40-70ఏళ్ల మధ్య ఉండే 2 లక్షల మంది జెనెటిక్ డేటాను అధ్యయనం చేయడం ద్వారా వారు ఈ విషయాలు కనుగొన్నారు.