బాలీవుడ్ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మార్చి 11న దేశ వ్యాప్తంగా 630 స్క్రీన్లలో విడుదలైంది. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలని భావించినా, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఇక, విడుదలైన అన్ని కేంద్రాలలో ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, విమర్శకులు మిశ్రమ రివ్యూలు అందించినప్పటికీ, ఈ సినిమాకు మార్చి 13 నుంచి 2,000 స్క్రీన్లకు పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి టాక్ రావడంతో థియేటర్లను పెంచారు. హైదరాబాద్ లో 4వ రోజు షోలు మొదటి రోజు కంటే ఎక్కువగా ఉన్నాయి. కశ్మీరీ పండిట్లకు సంబంధించిన నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి హృదయానికి హత్తు కునేలా చూపించాడు.