మేడ్చల్ జిల్లాలో వృద్ధాశ్రమ కేర్‌టేకర్ హత్యలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. తన తల్లితో వివాహేతర సంబంధం నడుపుతున్నందుకే కుమారుడు వ్యక్తిని హత్య చేసినట్లు తేలింది. కృష్ణా జిల్లాకు చెందిన వివాహితకు, ఫీర్జాదిగూడలో ఉంటున్న కోల వెంకటరమణమూర్తి(47)కి మధ్య వివాహేతరం సంబంధం ఏర్పడింది. మొదట హెచ్చరించినా తీరు మారకపోవడంతో నగరానికి వచ్చి వివాహిత కుమారుడు వెంకటరమణతో సన్నిహితంగా మెలిగాడు. ఆదివారం ఇరువురు మద్యం సేవించారు. ఈ క్రమంలో సిలిండర్‌తో వెంకటరమణ తలపై బాదాడు. కత్తితో పొడిచాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.