మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఆసుపత్రిలో మృతదేహాల కళ్లు మాయమౌతున్నాయి. ఎలుకలే కళ్లని మాయం చేస్తున్నాయని దర్యాప్తులో అధికారులు వెల్లడించడం వైరల్గా మారింది. 15రోజుల వ్యవధిలోనే ఒకే తరహా ఘటనలు వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి సారి ఫ్రీజర్ లేక మృతదేహాన్ని బయటే ఉంచడంతో ఎలుక ఎత్తుకుపోయి ఉండొచ్చని చెప్పారు. రెండో సారి ఫ్రీజర్లో ఉంచిన మృతదేహం కన్ను మాయమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఫోకస్ పెట్టింది. 48 గంటల్లోగా ఘటనపై నివేదిక అందించాలని ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు.