విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా, తమన్నా, మెహ్రిన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ F3. ఈనెల 27వ తేదీన విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీగా వసూళ్లను సాధించింది. తొలి మూడు రోజుల్లో సగానికి పైగా కలెక్ట్ చేసింది. తొలి వీకెండ్లో ఈ సినిమా రూ.రూ.34.25 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.29.75 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.