విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రిన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘F3’. ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదల అవగా.. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 12.5 మిలియన్లకు పైగా వ్యూస్, 250K+ లైక్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ‘F2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మే 27న విడుదల కానున్న ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కూడా మంచి హిట్స్ సాధించాయి.