ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) విశాఖపట్నం నుంచి పలు ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై, సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఇక జీత భత్యాలు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు అందించనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు facultyrecruit2022srd@iimv.ac.inకు మెయిల్ చేయాలని సూచించారు. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 21, 2022.