ఫేక్ MBBS డాక్టర్..43 వేల మందికి చికిత్స

© Envato

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ వైద్యుడు ముజతాబా అహ్మద్ ను అరెస్టు చేశారు. ఇతను ఏకంగా 4 ఏళ్లలో 43 వేల మందికి వైద్యం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎయిమ్స్ నుంచి MBBS చేసినట్లు ఫెక్ సర్టిఫికెట్లు తయారుచేయించుకున్నాడు. తర్వాత 2018లో చింతల్లో హెల్త్ కేర్ ఫార్మసీ పేరుతో ఆస్పత్రి మొదలుపెట్టాడు. సహాయకుడిగా మరో వ్యక్తిని నియమించుకుని అనేక మంది రోగులకు చికిత్స పేరుతో టెస్టులు, మందులు రాసి డబ్బులు దండుకునేవాడు. బీఫార్మసీ పూర్తిచేయని ముజతాబా గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version