అమెరికా స్టాక్ మార్కెట్లో మంగళవారం టెస్లా షేర్స్ భారీగా నష్టపోయాయి. ఏకంగా 7 శాతం షేర్లు కుప్ప కూలిపోవడంతో మస్క సంపద కూడా అదే స్థాయిలో పతనమైంది. దీంతో ఎలాన్ మస్క్ నికర సంపద 5.40 శాతం క్షీణించి 200 క్లబ్ నుంచి 192.7 బిలియన్ల డాలర్లు చేరుకుంది. అయితే 2021 తరువాత మస్క్ సంపద ఈ మేర కోల్పోవడం ఇదే తొలిసారి. ఇప్పటికీ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. 127.80 బిలియన్ల డాలర్ల సంపదతో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.