ప్రముఖ బాలీవుడ్ సింగర్ జుబిన్ నౌటియాల్ ఆసుపత్రిలో చేరారు. తన ఇంట్లోని మెట్లపై నుంచి కిందికి పడటంతో జుబిన్కి మోస్తరుగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మోకాలు, పక్కటెముకలకు గాయాలు కావడంతో చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. జుబిన్ కుడి భుజాన్ని కూడా ఎక్కువగా కదల్చకూడదని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకో జుబిన్ అంటూ ప్రార్థిస్తున్నారు. షేర్షా సినిమాలోని ‘రాతన్ లంబియాన్’ పాటను జుబిన్ ఆలపించారు.