పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్‌టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. పెనుమంట్ర మండలం పొలమూరులో జరుగుతున్న మహంకాళి అమ్మవారి జాతరలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలకు పాలాభిషేకం చేశారు. అయితే తర్వాత సీఎం పవన్ అని ఒక వైపు సీఎం ఎన్‌టీఆర్ అంటూ మరోవైపు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఇరువగ్గాల మధ్య వాగ్వాదం జోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి గొడవను నియంత్రించారు.