తమిళ్ సినిమా ‘తేరి’ రీమేక్‌ని పవర్ స్టార్ చేయనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో ‘WeDontWantTheriRemake’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్ ట్వీట్ల మోత కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన వెలువడనుందని డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ల తుపాను మొదలైంది. ఇంకా ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగులోనే ఉంది. ఈ సినిమాను హరీశ్ శంకర్ తీయనుండటంతో డైరెక్టర్‌ను, మైత్రీ మూవీ మేకర్స్‌ని అభిమాననులు వేడుకుంటున్నారు. ఇప్పటికే వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు రీమేకులుగా వచ్చాయని.. మరో సినిమా వద్దని అంటున్నారు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు చిత్రీకరణలో తీరికలేకుండా గడుపుతున్నారు.