కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’. విడుదలైన అన్ని చోట్ల హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో కన్పించి మెప్పించాడు. అయితే తమిళనాడులో విక్రమ్ మూవీ ఆడుతున్న థియేటర్‌కు నిప్పంటుకుంది. అది కూడా సూర్య సీన్ వచ్చే సమయంలో స్క్రీన్కు అంటుకున్న మంట స్క్రీన్ అంతా పాకింది. ఈ ప్రమాదానికి కారణం సూర్య ఫ్యాన్స్ అని, వారు అత్యుత్సాహంతో టపాసులు కాల్చడంతోనే నిప్పు అంటుందని ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరు షార్ట్ సర్క్యూట్ కారణంగా థియేటర్లో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. అయితే ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.