సుప్రీంకోర్టు సీజేఐ యూయూ లలిత్‌కు సహచర జడ్జిలు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో సోమవారమే వీడ్కోలు పలికారు. సుప్రీం 49వ ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజులపాటు కొనసాగారు. సంతృప్తికర భావనలతో సుప్రీంకోర్టు నుంచి వైదొలుగుతున్నట్లు లలిత్ పేర్కొన్నారు. తదుపరి సీజేఐగా డీవై చంద్రచూడ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నానని తెలిపారు.
సీజేఐ లలిత్‌కు ఘన వీడ్కోలు

© ANI Photo