మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశంపై అమరావతి రైతులకు అనుకూలంగా నేడు హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో 800 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈ తీర్పును స్వాగతించారు. ‘జై అమరావతి’ నినాదాలు చేస్తూ.. పటాసులు పేల్చి, స్వీట్లు పంచారు. ఈ తీర్పు న్యాయాన్ని నిలబట్టిందంటూ న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు రైతుల ఆందోళనలో 200 మందికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటికైనా సీఎం జగన్ తన పంతాన్ని వీడి కోర్టు తీర్పును గౌరవించాలని కోరారు.