అస్సాంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మంటల ధాటికి గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో అగ్ని జ్వాలలు చెలరేగాయి. ఇళ్లతో పాటు బైకులు, కార్లు కూడా దహనమయ్యాయి. వస్తువులు, డబ్బులు, దుస్తులు, విలువైన పత్రాలు కాలి బూడిదయ్యాయి.
అస్సాంలో ఘోర అగ్ని ప్రమాదం; కాలి బూడిదైన 200 ఇళ్లు

© Envato