నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇందల్‌వాయి మండలం చాంద్రాయన్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఓ కారు అతి వేగంతో ముందు వెళ్తున్న కంటైనర్‌కు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.