TS: జగిత్యాల జిల్లా- రాజారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాలన్సి ఉంది.