కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

yousay

కర్ణాటక- తుమకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలిన హళ్లి వద్ద క్రూజర్, లారీ ఢీకొనడంతో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను రాయచూర్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్రూజర్‌లో మొత్తం 20 మంది ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version