తెలంగాణలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో తండ్రీకొడుకులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. యాదాద్రి జిల్లా రామాజీపేట గ్రామానికి చెందిన బాల నర్సయ్య, సచిన్ ఫలితాల్లో ఘనత సాధించారు. సచిన్ హైదరాబాద్‌లో గ్రూప్ కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధమవుతున్నాడు. బాలనర్సయ్య ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సర్పంచ్‌గాను విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్‌కు అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.